![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఇది ఒక సూపర్ ట్విస్ట్.. అది సీజన్-9 లోనే జరిగింది. అదేంటంటే మూడో వారంలో మిడ్ వీక్ అర్థరాత్రి డేంజర్ బెల్స్ కొట్టి హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరిని లేపి.. సంజనని బయటకి పంపించేశాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత అందరు ఎమోషనల్ అయ్యారు. అయితే కొంతమంది మాత్రం సీక్రెట్ రూమ్ అని అనుకున్నారు.
నిన్న మొన్నటి దాకా సంజన సీక్రెట్ రూమ్ లో ఉంటుందని అనుకున్నారు కానీ తను ఎలిమినేషన్ అయ్యింది. తాజాగా రిలీజ్ చేసిన సెకెండ్ ప్రోమోలో .. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటు వీడియోని వదిలాడు బిగ్ బాస్ మామ. దాంతో ఆడియన్స్ కి ఒక్కసారిగా బుర్రపాడు. ప్రోమోలో ఏం ఉందో ఓసారి చూసేద్దాం.. స్టేజ్ మీద ఉన్న నాగార్జున దగ్గరికి ఎలిమినేషన్ అయి సంజన వచ్చేస్తుంది. నేను ఎలిమినేషన్ అయ్యేంతగా ఏం బ్యాడ్ చేశాను సర్ అని సంజన అంటుంది. ఒక్కసారి అయితే బాగుంటది కానీ అన్నిసార్లు అదే చేస్తే వాళ్లకి కూడా ఇరిటేషన్ ఉంటుందని నాగార్జున అన్నాడు. ఇక ఒక్కొక్కరి గురించి చెప్పమని సంజనని అడిగాడు నాగార్జున. సుమన్ శెట్టికి స్టాండ్ లేదని, అర్థం చేసుకోడని సంజన అంటుంది. శ్రీజ మార్చుకోవాల్సిందేంటి సంజన అని నాగార్జున అనగానే.. వన్ థౌజెండ్ పర్సెంట్(1000%) ఆర్గుమెంట్స్ నుండి త్రీ హండ్రెడ్ పర్సెంట్(300%) ఆర్గుమెంట్స్ కి ఇప్పుడు దిగారు అని శ్రీజ గురించి సంజన అంది. ఇక భరణి లేచి.. మిస్ యూ సంజన గారు అనగానే.. అదేంటి బయటకు వెళ్ళడానికి నువ్వే కదా ఓటేశావని నాగార్జున ఫిట్టింగ్ పెట్టాడు. అన్న, చెల్లి వద్దు.. ఎప్పుడు గొడవ జరిగిందో అప్పుడు మాట్లాడాలని భరణి గురించి సంజన అంది.
ఇక హరీష్ గురించి సంజనని చెప్పమనగానే తన భాదని చెప్పుకుంది. ఏది మాట్లాడినా గొడవకి వచ్చేస్తాడు. తనే ఫైనల్.. తన మాటే వినాలి.. తను ప్రైమ్ మినిస్టర్ అని అనుకుంటామో.. తనతో బ్రతకలేమో సర్, తను ఒక్కమాట కూడా ఆక్సెప్ట్ చేయలేం మనం.. అంటు సంజన చెప్పుకొచ్చింది. ఇలా ఒక్కొక్కరి గురించి సంజన చెప్పగానే.. ఎలిమినేషన్ అంటు బయటకు పంపించేశాడు నాగార్జున. మరి ఈ ప్రోమో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
![]() |
![]() |